రూపాయి పావలా అంటే 125 సీట్లా: కొడాలి నాని

రూపాయి పావలా అంటే 125 సీట్లా: కొడాలి నాని

చంద్రబాబు  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ వైసీపీని రూపాయి పావలా పార్టీ అంటున్నాడని అంటే ఆయన ఉద్దేశం ప్రకారం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 125 సీట్లు వస్తాయని ఒప్పుకున్నట్లేనా అని మాజీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. అంటే టీడీపీ-జనసేన పొత్తుకు 25 సీట్లు వస్తాయని పవన్ కల్యాణ్ ఉద్దేశమని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. 

కరిచే కుక్క మొరగదు... మొరిగే కుక్క కరవదు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై  తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని. పవన్ కల్యాణ్ పార్టీకి ఒక నిబద్దత, విధానాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పార్టీతో జతకడతారో ఎప్పుడు ఎవరితో ఎందుకు ఉంటారో పవన కల్యాణ్‌కే తెలియదంటూ ఎద్దేవా చేశారు. 

 టీడీపీ, జనసేన పొత్తుపైనా పవన్ కల్యాణ్ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వ్యవహారంలో పవన్ కల్యాణ్ వ్యవహారశైలి గందరగోళంగా ఉందన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ స్పష్టంగా చెప్తోందని... కానీ పవన్ కల్యాణ్ మాత్రం తాను ఎన్టీఏలో ఉన్నానంటూ ప్రకటనలు ఇస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో కూడా పొత్తు అని అంటున్నాడని అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని మాజీమంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.