KKR vs SRH: రస్సెల్ వీర ఉతుకుడు.. సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

KKR vs SRH: రస్సెల్ వీర ఉతుకుడు.. సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు నిరాశపరించారు. ఆరంభంలో బాగా వేసినా.. ఆ తర్వాత కేకేఆర్ బ్యాటర్ల ధాటికి సమాధానం లేకుండా పోయింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆండ్రీ రస్సెల్ వీర ఉతుకుడుకు తోడు సాల్ట్ హాఫ్ సెంచరీ.. రమణ్ దీప్, రింకూ సింగ్ మెరుపులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయగలిగింది. 

ఆరంభంలో సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా నటరాజన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేష్ అయ్యర్(7), శ్రేయాస్ అయ్యర్ (0) లను పెవిలియన్ కు పంపి కేకేఆర్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత స్పిన్నర్ మార్కండే 8 పరుగులు చేసిన నితీష్ రానాను ఔట్ చేశాడు. దీంతో కోల్ కతా 51 పరుగులకే నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు బిగించారు.అయితే హైదరాబాద్ జట్టుకు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజ్ లో పాతుకుపోయిన సాల్ట్, రమణ్ దీప్ సింగ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్కోర్ వేగాన్ని పెంచారు. 

ఈ క్రమంలో 17 బంతుల్లో నాలుగు సిక్సులతో 35 పరుగులు చేసిన రమణ్ దీప్.. ఆ వెంటనే హాఫ్ సెంచరీ చేసిన సాల్ట్ ఔట్ కావడంతో 119 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లుగా అనిపించింది. అయితే అసలు ఆట అప్పుడే మొదలైంది. రస్సెల్ తన విధ్వంసాన్ని చూపించాడు. 25 బంతుల్లోనే 7 సిక్సులు, 3 ఫోర్లతో  64 పరుగులు చేసి స్కోర్ కార్డు ను 200 పరుగులకు చేర్చాడు. మరో ఎండ్ లో రింకూ సింగ్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 85 పరుగులు రాబట్టింది.