V6 News

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్.. ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే

ఐపీఎల్ 19లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్, కోల్‎కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో కేకేఆర్ టాస్ గెలిచింది. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హోం గ్రౌండ్‎లో చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ గాయం కారణంగా ఈ మ్యాచుకు కూడా  దూరమయ్యాడు. దీంతో గ్రౌండ్‎లో తలాను చూడాలనుకున్న అతడి అభిమానులు మళ్లీ నిరాశకు గురయ్యారు. 

ఐపీఎల్‎లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లుగా పేరున్న చెన్నై, కోల్‎కతా ఈ సీజన్‎ను అతి దారుణంగా ఆరంభించాయి. ఇరు జట్లు ఆడిన తొలి మ్యాడు మ్యాచుల్లో వరుసగా ఓటమి పాలయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని సీఎస్‌కే నాలుగో మ్యాచ్‌లో ఎట్టకేలకు ఢిల్లీపై విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ టోర్నీలో కేకేఆర్ ఇప్పటి వరకు విజయాల ఖాతా తెరవలేదు. దీంతో చెన్నైపై గెలిచైనా బోణీ కొట్టాలని కేకేఆర్ భావిస్తోంది. మరోవైపు ఢిల్లీపై గెలుపు జోష్‎లో ఉన్న సీఎస్కే సొంతగడ్డపై కేకేఆర్‎ను చిత్తు చేసి టోర్నీలో రెండో విజయం నమోదు చేయాలని చూస్తోంది. 

KKR ప్లేయింగ్ XI: అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ (WK), కెమెరూన్ గ్రీన్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా

CSK ప్లేయింగ్ XI: సంజు శాంసన్ (WK), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్