డాక్టర్, నర్స్ అయితే చాలు గ్రీన్ కార్డు వచ్చినట్టే

డాక్టర్, నర్స్ అయితే చాలు గ్రీన్ కార్డు వచ్చినట్టే

కరోనా వైరస్ భయంతో వణుకుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డులను పెద్ద సంఖ్యలో విదేశీ డాక్టర్లకు, నర్సులకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం చట్టసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఎవరికీ కేటాయించని 40 వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. హెల్త్ కేర్ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ చట్టం కింద నిరుపయోగంగా ఉన్న గ్రీన్‌కార్డులను పంపిణీ చేసే అధికారం పార్లమెంటు(కాంగ్రెస్)కు ఉంది. దీంతో బిల్లు దాదాపుగా ఆమోదించినట్లేనని తెలుస్తోంది.

అమెరికాలో కరోనా విజృంభిస్తుండటంతో  వైద్యసిబ్బందిని పెంచుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. చట్టసభలో తీర్మానం నెగ్గి చట్టంగా మారితే 25 వేలమంది నర్సులు, 15వేల మంది డాక్టర్లకు గ్రీన్‌కార్డులు వచ్చే అవకాశముంది. అయితే వారు కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందించాల్సి ఉంటుంది.