7లక్షల షాపులకు చావుదెబ్బ

7లక్షల షాపులకు చావుదెబ్బ

వీటిలో పాన్​ దుక్నాలు, టీ స్టాల్సే ఎక్కువ గ్రోత్‌‌‌‌‌‌‌‌ తగ్గింది…
తిరిగి తెరుచుకునే అవకాశాలు తక్కువే
కోలుకోలేని దెబ్బకొట్టిన లాక్‌‌‌‌డౌన్‌‌‌‌
ఆలస్యం కానున్న రికవరీ
తాజా స్టడీలో వెల్లడి

కిరాణా వస్తువుల అమ్మకాలు గత ఏప్రిల్‌‌‌‌‌‌‌‌, మే నెలలతో పోలిస్తే ఈసారి 34 శాతం తగ్గాయని సేల్స్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ నీల్సన్‌‌‌‌‌‌‌‌ సర్వే పేర్కొంది. పట్టణాల్లోని చిన్న షాపుల్లో అమ్మకాలు 38 శాతం పడిపోయాయని తెలిపింది. మెట్రో నగరాల్లో జనవరి–మార్చి క్వార్టర్లోనే అమ్మకాలు బాగా తగ్గాయని వివరించింది.  ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించు కోలేకపోవడం, అధిక అద్దెలు వంటి వాటి వల్ల షాపులను మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ వీరేన్‌‌‌‌‌‌‌‌ షా వివరించారు.

ముంబైకరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ఏడు లక్షల చిన్న షాపుల యజమానుల పొట్ట కొట్టింది. వారి ఉపాధిని లాగేసుకుంది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ సమయంలో కనీసం  లక్షలాది చిన్న పాన్​, టీ, కిరాణా షాపులు మూతబడి ఉండొచ్చని కన్జూమర్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీల స్టడీ వెల్లడించింది. యజమానుల చేతిలో చిల్లిగవ్వ లేక గ్రామాలకు వెళ్లిపోవడం వల్ల ఆరు లక్షల దుకాణాలు మూతబడ్డాయని అంచనా. వీటిలో మెజారిటీ షాపులు తెరుచుకునే అవకాశం లేదని ఈ కంపెనీలు చెబుతున్నాయి. కిరాణాలతోపాటు 1.50 లక్షల మొబైల్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌‌‌‌‌ షాపులూ ఇదేకాలంలో క్లోజ్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. నాన్‌‌‌‌‌‌‌‌–ఎసెన్షియల్‌‌‌‌‌‌‌‌ వస్తువుల అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, వీటిలో 60 శాతం షాపులు తెరుచుకోలేదు. ఇదివరకటి లాగా డిస్ట్రిబ్యూటర్లు 21 రోజుల క్రెడిట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం లేదు. వెంటనే డబ్బు అడుగుతుండడంతో షాపుల యజమానులకు ఇబ్బందులు వస్తున్నాయి. లక్షల సంఖ్యలో షాపులు మూతబడటం వల్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌ రికవరీ చాలా ఆలస్యమవుతుందని ఇండస్ట్రీ ఆందోళన చెందుతోంది.

చిన్న షాపులకు పెద్ద దెబ్బ

ఈ నేపథ్యంలో పార్లే కంపెనీ ఒక చేదు వాస్తవాన్ని బయటపెట్టింది. వీధుల్లో, రోడ్లపక్కన టీ, పాన్‌‌‌‌‌‌‌‌ అమ్మే 58 లక్షల చిన్న స్టోర్లలో 10 శాతం షాపులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–మే మధ్యలో మూతబడ్డాయని తెలిపింది. దీంతో తమ డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా నష్టపోయారని పార్లే కేటగిరీ హెడ్‌‌‌‌‌‌‌‌ బి.కృష్ణారావు అన్నారు. ‘‘ఇలాంటి షాపులు ఇక తెరుచుకునే అవకాశాలు లేవు. మనదేశంలోని 42 లక్షల పెద్ద కిరాణాల్లోనూ 1–2 శాతం మూతబడ్డాయి. చాలా మంది ఓనర్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వీళ్లలో చాలా మంది ఐదారు నెలల వరకు రాకపోవచ్చు. కొందరు మాత్రమే తిరిగి ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్న షాపుల మూసివేత ల వల్ల కంపెనీలపైనా ప్రభావం ఉంటుంది’’ అని రావు వివరించారు. బ్రిటానియా ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ ఎండీ వరుణ్‌‌‌‌‌‌‌‌ బెర్రీ  మాట్లాడుతూ షాపుల మూసివేత తాత్కాలికమేనని, లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా ఎత్తివేయగానే అంతా వెనక్కి వస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు. ఇక ముందు షాపుల సంఖ్య కొంత తగ్గవచ్చని చెప్పారు. షాపుల మూసివేత శాశ్వతంగా ఉండదని, అయితే  ఎంత కాలం ఉంటుందో చెప్పలేమని గోద్రెజ్‌‌‌‌‌‌‌‌ కన్జూమర్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ సీఈఓ సునీల్‌‌‌‌‌‌‌‌ కటారియా అన్నారు. మనదేశంలో దాదాపు 1.2 కోట్ల చిన్న షాపులు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవే ఎక్కువ.  సబ్బులు, బిస్కెట్లు, చాక్లెట్లు, టీపౌడర్‌‌‌‌‌‌‌‌ వంటి వాటి అమ్మకాల్లో చిన్న షాపుల వాటా 20 శాతం వరకు ఉంటుంది.

ఫోన్‌‌‌‌‌‌‌‌ షాపులకు ఎన్నో కష్టాలు

ఆలిండియా మొబైల్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అరవిందర్‌‌‌‌‌‌‌‌ ఖురానా మాట్లాడుతూ చేతిలో డబ్బు లేకపోవడం, కంపెనీల నుంచి స్టాకు సరిగ్గా రాకపోవడంతో ఓనర్లు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. రూ.15 వేల కంటే తక్కువ రేటున్న ఫోన్ల సప్లై చాలా తక్కువ ఉందని అన్నారు. ఫోన్ల కొనుగోలుకు లోన్లు దొరకడం లేదని, షాపులకు వచ్చే కస్టమర్ల సంఖ్య బాగా తగ్గిందని వివరించారు. ఐడీసీ ఇండియా రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ నవ్‌‌‌‌‌‌‌‌ఖేందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ఇబ్బందుల వల్ల చాలా షాపులు మూతబడుతాయని స్పష్టం చేశారు. అయితే చిన్న పట్టణాల్లో అమ్మకాలు పెంచుకోవడానికి అక్కడి రిటైలర్లకు మొబైల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు కొంత సాయం చేయొచ్చని, వాటి అమ్మకాల్లో 62 శాతం ఆఫ్​లైన్​లోనే జరుగుతాయని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..