
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ హామీ
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని బీజేపీ నేత.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ హామీ ఇచ్చారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ నేతలతో కలసి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా టైమ్ లో ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని.. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే.. కరోనా టీకా తీసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదని.. జీహెచ్ఎంసీ ఉచితంగా ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ స్క్రాప్ చేసి.. ప్రణాళికా బద్దంగా మౌళిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. ఆక్రమణల వల్ల.. జీహెచ్ఎంసీ తీరు వల్ల.. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల హైదరాబాద్ నగరం మునిగిపోయిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే వర్షపు నీరు వెళ్లేందుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని.. వరదల వల్ల నష్టపోయిన వారికి 25 వేల రూపాయల చొప్పున సహాయం అందజేస్తామని ఫడణవీస్ హామీ ఇచ్చారు.
for more News…
గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఫ్రీ
బీజేపీ గెలిస్తే నాలాల బాగుకు సుమేధ చట్టం