ఐస్‌క్రీమ్ తో వేడి వేడి పకోడా చేసిన స్ట్రీట్ వెండర్

ఐస్‌క్రీమ్ తో వేడి వేడి పకోడా చేసిన స్ట్రీట్ వెండర్

స్ట్రీట్ వెండర్స్ పలురకాల వెరైటీలతో కస్టమర్స్ ను ఆకట్టుకోవడం చూస్తూనే ఉంటాం. వాటిల్లో ఇటీవల ఢిల్లీలో ఓ వ్యాపారి చేసిన కరేలా పకోడా, కుల్హాద్ లో చేసిన ఎగ్ పిజ్జా అలాంటి కోవలోకి చెందినవే. ఇప్పుడు అదే తరహా వెరైటీ ఫుడ్ తో లక్నోలోని రాజాజీపురంకు చెందిన ఓ వీధి వ్యాపారుడు చేసిన  ఫ్రైడ్ ఐస్ క్రీమ్ పకోడా ప్రస్తుతం వైరల్ గా మారింది.

దీనికి సంబంధించిన వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ 'ఈట్‌విత్‌సిడ్'లో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ పకోడాను చేసి, ప్లేట్ లో సర్వ్ చేయడాన్ని గమనించవచ్చు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ గ్రహం వదిలి వెళ్లే సమయం ఆసన్నమైందని ఒకరంటే, ఇది ఐస్ క్రీం కాదు వేడి క్రీమ్ వడలు అని మరొకరు రాసుకొచ్చారు.