తెలంగాణలో రూ.3 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న లులూ గ్రూప్

తెలంగాణలో రూ.3 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న లులూ గ్రూప్

యూఏఈకి చెందిన లూలూ గ్రూప్‌ తెలంగాణలో రూ. 3 వేల 500  కోట్ల  పెట్టుబడి పెట్టనున్నట్లుగా వెల్లడించింది.  బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్లో మంత్రి కేటీఆర్, లులూ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.  మంత్రి కేటీఆర్ సమక్షంలో పెట్టుబడుల కార్యచరణపై లులు గ్రూప్‌ ఈ ప్రకటన చేయగా రూ. 3 వందల కోట్లతో హైదరాబాద్ లో షాపింగ్ మాల్ ప్రారంభిస్తామని ప్రకటించింది.  

ఈ షాపింగ్ మాల్ ద్వారా 2 వేల మందికి పైకి ఉపాధి లభించనుందని లూలూ చైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షాపింగ్‌ మాల్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే లులూ మాల్‌కు సంబంధించి 80శాతం పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు.  

ALSO READ:Banana Pani Puri: దీన్ని కూడా వదల్లేదా : బనానా (అరటి కాయ) పానీ పూరీ

భారతదేశంలో 50,000 మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, తన వివిధ సంస్థలు ఇప్పటివరకు 22,000 ఉద్యోగాలు ఇచ్చాయని యూసఫ్ అలీ అన్నారు. కాగా, గత దావోస్‌ పర్యటనలో మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో లులూ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదు‌ర్చుకుంది, 

 లులూ సంస్థ ప్రతినిధులు భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. లూ సంస్థ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు దూసుకుపోతుందని చెప్పారు.