‘మిల్లెట్స్ లంచ్’ లో అన్ని పార్టీల నేతలు పాల్గొనడం సంతోషకరం : మోడీ

‘మిల్లెట్స్ లంచ్’ లో అన్ని పార్టీల నేతలు పాల్గొనడం సంతోషకరం :  మోడీ

భారత పార్లమెంట్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం వినూత్న కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ కార్యక్రమాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. మిల్లెట్లతో తయారైన ప్రత్యేక వంటకాలను వడ్డించారు. ‘2023ని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరంగా గుర్తించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్లమెంటులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాను. మిల్లెట్ వంటకాలు వడ్డించారు. అన్ని పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం  సంతోషకరం’ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

2023ను అంతర్జాతీయ మిల్లెట్​ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ క్రమంలో వీటి ప్రాధాన్యతను చాటిచెప్పడం, మిల్లెట్లకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తో పాటు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేలు ఒకే టేబుల్ పై కూర్చొని భోజనం చేశారు.