Andhra train accident: హిస్టరీ : తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలు

Andhra train accident: హిస్టరీ : తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలు

ఏపీలోని విజయనగరం జిల్లాలో హైరాచెన్నై లైన్ లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. 50 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఈప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్లు,గార్డుమృతిచెందారు. మృతదేహాలను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఘటనాస్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం రైలు ప్రమాద ఘటనకు ముందు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రైలు ప్రమాదాల్లో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రైలు కొన్ని ప్రధాన రైలు ప్రమాదాలు ఇలా ఉన్నాయి. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రధాన రైలు ప్రమాదాలు:

21 జనవరి 2017 : హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్18448, జగదల్‌పూర్ నుండి భువనేశ్వర్ వెళ్లే షెడ్యూల్డ్ ప్యాసింజర్ రైలు.. ఆంధ్ర ప్రదేశ్ లోని  విజయనగరం జిల్లా కూనేరు సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో  41 మంది మృతిచెందారు. 68 మంది గాయపడ్డారు. రైలులో 600 మంది ప్రయాణికులు ఉన్నారు.

30 జూలై 2012: తమిళనాడు ఎక్స్‌ప్రెస్లో మంటలు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ మంటల్లో చిక్కుకుని 47 మంది మృతిచెందారు. 25 మంది గాయపడ్డారు.

మే 22, 2012:  హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీ
అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలును ఢీకొనడంతో కనీసం 25 మంది మృతిచెందారు. 

ఆగస్టు 18, 2006: చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు బోగీలు మంటల్లో చెలరేగాయి.. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

అక్టోబర్ 29, 2005: వాగులో పడ్డ రేపల్లె-సికింద్రాబాద్ డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్
నల్గొండ జిల్లా వలిగొండ సమీపంలో రేపల్లె-సికింద్రాబాద్ డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ పొంగిపొర్లుతున్న వాగులో పడి 114 మంది మరణించారు.

జూలై 2, 2003: వరంగల్ లో  రోడ్డ అండర్ బ్రిడ్జిపై పడిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు
గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఇంజన్ , రెండు కోచ్‌లు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు అండర్ బ్రిడ్జిపై నుండి పడిపోవడంతో 18 మంది మృతిచెందారు.

అక్టోబర్ 10, 1990: నక్సలైట్ల దాడిలో ప్యాసింజర్ రైలు దగ్ధం
 హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లి వద్ద అనుమానిత నక్సలైట్లు ప్యాసింజర్ రైలును తగులబెట్టడంతో 40 మంది సజీవదహనమయ్యారు.

ALSO READ : Andhra train accident: ఏపీ రైలు ప్రమాదం: 33 రైళ్లు రద్దు...22 రైళ్లు దారి మళ్లింపు