వీడియో: మాస్క్ ఏదని అడిగిన పోలీసులపై దాడి చేసిన యువకుడు

వీడియో: మాస్క్ ఏదని అడిగిన పోలీసులపై దాడి చేసిన యువకుడు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. మాస్క్ ధరించనందుకు అడ్డుకున్న పోలీసులపై దాడికి దిగాడు. ఆ వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు కంట్రోల్ చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా కుదరకపోవడం పోలీసులు కూడా అతనిపై దాడి చేశారు. రోడ్డుపై చాలా సేపు పోలీసులకు, యువకుడికి మధ్య గొడవ జరిగింది. స్థానికులు వచ్చి యువకుడిని పక్కకు లాగారు. మాస్క్ పెట్టుకోనందుకు ఫైన్ వేయడంతో యువకుడు తమ సిబ్బందిపై దాడి చేశాడని దేవ్ నగర్ ఎస్ఐ తెలిపారు. పోలీసులపై దాడి చేసినందుకు కేసు పెట్టడంతో పాటు మాస్క్ ధరించనందుకు చలానా వేశామని ఆయన తెలిపారు. ఆ యువకుడిపై గతంలో తండ్రిపై దాడి చేసిన కేసు కూడా నమోదయిందని ఆయన తెలిపారు.

For More News..

ఒకే టీచర్‌ 25 స్కూళ్లలో రిజిష్టర్.. ఏడాదికి కోటి రూపాయలు డ్రా

వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ..

కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో మహిళకు ఫోన్ చేసి..