
రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుండీ జిల్లాలోని లఖేరీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సు మెజ్ నది వద్దకు రాగానే డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దాంతో బస్సు బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు నదిలోకి దూకి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన అధికారులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
For More News..