పాక్​లోని పంజాబ్​కు తొలి మహిళా సీఎం

పాక్​లోని పంజాబ్​కు తొలి మహిళా సీఎం
  • మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​ కుమార్తె మర్యమ్ ఎంపిక

లాహోర్: పాక్ మాజీ ప్రధాని నవాజ్​షరీఫ్​ కుమార్తె, పాకిస్తాన్​ ముస్లిం లీగ్ ​నవాజ్​(పీఎంఎల్​ఎన్) పార్టీ సీరియర్​ లీడర్ నవాజ్​మర్యమ్​ ఆ దేశంలోని పంజాబ్​ ప్రావిన్స్​ తొలి మహిళా సీఎంగా ఎన్నికయ్యారు. సోమవారం పంజాబ్​ ప్రావిన్స్ అసెంబ్లీలో సీఎం ఎన్నిక నిర్వహించారు. పీఎంఎల్​ఎన్ పార్టీ అభ్యర్థిగా మర్యమ్, ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ మద్దతు గల సున్ని ఇత్తేహాద్​కౌన్సిల్​(ఎస్ఐసీ) పార్టీ నుంచి రాణా ఆఫ్తాబ్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ పోటీలో ఉన్నారు. అయితే, ఎన్నికకు ముందు ఎస్ఐసీ సభ్యులు వాకౌట్​చేసి వెళ్లిపోయారు. 

దీంతో 327 సీట్లున్న సభలో మర్యమ్​ 220 ఓట్లు సాధించి సీఎంగా ఎన్నికయ్యారు. 50 ఏండ్ల మర్యమ్..​ పీఎంఎల్​ఎన్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాగా.. ఆమె తన తొలి ప్రసంగంలో దేవుడికి, తన తండ్రి నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్, తనకు ఓటు వేసిన చట్టసభ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి కూర్చునే సీట్లో కూర్చోవడం ఆనందంగా ఉందన్నారు.