చైనాలో భారీ అగ్నిప్రమాదం

చైనాలో భారీ అగ్నిప్రమాదం

బీజింగ్: చైనాలో ఘోరం జరిగింది. కోల్ మైన్ కంపెనీ బిల్డింగులో మంటలు అంటుకుని 26 మంది చనిపోయారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం ఘటన షాంగ్జీ ప్రావిన్స్ లో గురువారం ఉదయం 6:50 గంటల ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ‘‘ప్రైవేట్ కోల్ మైన్ కంపెనీకి చెందిన ఐదంతస్తుల బిల్డింగులో మంటలు అంటుకున్నాయి. బిల్డింగ్ రెండో అంతస్తులో మంటలు చెలరేగి, మిగతా ఫ్లోర్లకు వ్యాపించాయి.

 ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని, ఎనిమిది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు” అని చెప్పారు. గాయపడినోళ్లను ఆస్పత్రులకు తరలించి, ట్రీట్ మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్.. అగ్ని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.