మేడారంలో ముందస్తు మొక్కులు.. పెరిగిన భక్తుల రద్దీ

మేడారంలో ముందస్తు మొక్కులు.. పెరిగిన భక్తుల రద్దీ

ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర దగ్గర పడడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం(ఫిబ్రవరి 18) వనదేవతల దర్శనానికి పోటెత్తారు. త్వరలో మహాజాతర ప్రారంభం కానుండడం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, కల్యాణకట్ట వద్ద తలనీలాలు ఇస్తున్నారు భక్తులు. ఎత్తు బంగారంతో క్యూలైన్లలో గద్దెల వద్దకు చేరుకొని వనదేవతలకు సారె, బెల్లం సమర్పిస్తున్నారు. 

ఎత్తు బెల్లం, సారె సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు జంపన్న వాగులోని ట్యాపులన్నింటికీ నీటి సప్లయ్​ఇచ్చారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తుల కోసం క్యూ లైన్లలో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు.