మహిళల అభ్యున్నతికి పాటు పడింది ఆ ఇద్దరే : ఎర్రబెల్లి

మహిళల అభ్యున్నతికి పాటు పడింది ఆ ఇద్దరే : ఎర్రబెల్లి

మహిళల అభ్యున్నతికి, గౌరవానికి పాటు పడింది ఇద్దరే నాయకులని.. వారిలో ఒకరు నందమూరి తారక రామారావు, మరోకరు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్టీఆర్ అనాడు 30 రూపాయలతో పింఛన్ ప్రారంభించారని, దాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ 2 వేల 16 రూపాయలకు పెంచారని చెప్పారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.

ALSO READ: 4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా
 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. కేశంపేట మండలంలో సుమారు రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంగెం గ్రామంలో నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం అల్వాల్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.