4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా

4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా

రంగారెడ్డి జిల్లాలో ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల గ్రామస్తులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీరు లేక అల్లాడిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులంతా కలసి ఖాళీ బిందెలతో నాలుగు గంటలుగా రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నాను కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజేప్పి, ధర్నాను విరమింపజేశారు.