
TRS ప్రభుత్వం వచ్చాకే జనగామ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్రసర్కార్ సహకరించకపోయిన స్వశక్తితో ఎదిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. జనగామాలో రేపు (శుక్రవారం) జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, TRS పార్టీ ఆఫీసు ప్రారంభం చేయడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలకాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ కోరారు. తెలంగాణ ప్రజలు రేపటి సభకు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. జనగామ జిల్లాను ఇచ్చి, అన్నివిధాల అభివృద్ధి చేసి జిల్లాకు వస్తున్న సందర్భంగా సీఎం కేసిఆర్‌కు రేపు ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు. జనగామ కరువు జిల్లాగా ఉండేది... కానీ మిషన్ భగీరథ, దేవాదుల ద్వారా తాగునీరు, సాగునీరు పుష్కలంగా వస్తోంది అంటే అది సీఎం కేసిఆర్ కృషి ఫలితమేనన్నారు.
రేపు జనగాం జిల్లాలో KCR పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు.
మరిన్ని వార్తల కోసం..
మేడారం జాతరలో e- హుండీలు