ప్రపంచ అందగత్తెల పోటీ నుంచి చైనా బ్యూటీ ఔట్..

 ప్రపంచ అందగత్తెల పోటీ నుంచి చైనా బ్యూటీ ఔట్..

మిస్ యూనివర్స్ పోటీ నుంచి చైనా బ్యూటీ జియాక్వి తప్పుకుంది.. మరికొన్ని గంటల్లో ఫైనల్స్ జరగనున్న క్రమంలో.. ఈ విషయం వెలుగులోకి రావటం ఆసక్తిగా మారింది. మిస్ చైనాగా.. ఈసారి ఫైనల్స్ వరకు వెళుతుంది.. కిరీటం దక్కించుకుంటుందనే ప్రచారం జరిగింది. రేసులో ఉన్న చైనా బ్యూటీ జియాక్వి మిస్ యూనివర్స్ పోటీల నుంచి తప్పుకోవటం వెనక.. వీసా సమస్యలు అని వెల్లడించింది. అయితే దీన్ని ఎవరూ నమ్మటం లేదు.. ఓ దేశం తరపున పోటీల్లో పాల్గొంటున్నప్పుడు వీసా సమస్య ఏంటీ అనే ప్రశ్నలతో కొత్త చర్చ నడుస్తుంది. 2024 చైనాలో మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్నాయి.. అలాంటిది.. ఈ ఏడాది జరిగే పోటీల నుంచి చైనా బ్యూటీ ఎలా తప్పుకుంది అనేది ఆసక్తిగా మారింది. 

మిస్ యూనివర్స్ పోటీలు ఎల్ సాల్వడార్ లో జరుగుతున్నాయి. 90 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటున్నారు. ఈసారి పోటీల్లో.. ఫస్ట్ టైంలో.. హిస్టరీలోనే.. కొలంబియా, గ్వాటెమాలాకు చెందిన పిల్లల తల్లులు.. పోటీల్లో పాల్గొనటం విశేషం. అదే విధంగా పోర్చుగల్, నెదర్లాండ్ కు చెందిన ట్రాన్స్ జెండర్స్ సైతం మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఈసారి పోటీలకు మరింత హైప్ వచ్చింది. 

మిస్ యూనివర్స్ నుంచి తప్పుకోవటంపై చైనా భాషలో ఎక్స్ పోస్టు చేసింది జియాక్వి.. అనుకోకుండా మరో దేశంలో దిగాల్సి వచ్చిందని.. అక్కడి నుంచి పోటీలు జరిగే ప్రాంతానికి వెళ్లటానికి వీసా సమస్యలు వచ్చాయని స్పష్టం చేసింది. మొత్తానికి చైనా బ్యూటీ అయితే ఈ పోటీల్లో లేకపోవటం వెలితే అంటున్నారు నెటిజన్లు..