లక్షల్లో మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు..పరిష్కారం కోసం బాధితుల అభ్యర్థన

లక్షల్లో మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు..పరిష్కారం కోసం బాధితుల అభ్యర్థన

ప్రతీక్ వైష్ణవ, అతని చెల్లెలు కృతిక ఇద్దరూ చదువుల్లో టాప్. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఈ ఇద్దర్ని చదివించడానికి వారి తల్లి పడే కష్టం అంతాఇంతా కాదు. ఆమె భర్త తాగుబోతు. ఐదేళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇన్సూరర్ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొద్దామంటే ఇంకా రెండేళ్లు ఆగాల్సిందే. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల ప్రకారం.. ఇన్సూరెన్స్ చేయించుకున్న ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోతే, వారు మరణించినట్టు పరిగణలోకి తీసుకుని, ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్​ చేయడానికి ఏడేళ్లు ఆగాలి అనే నిబంధన ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి  పాలసీ హోల్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వరగా బయటపడేయడానికి ఈ నిబంధనను సడలించాలని బాధితులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏడేళ్లుగా ఉన్న ఈ నిబంధనను, మూడేళ్లకు కుదించాలని ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏకు విజ్ఞప్తి చేస్తున్నారు.  .

లక్షల్లో మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2016లో మొత్తంగా 5,49,008 మంది మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. వారిలో 2,29,381 మంది మాత్రమే ట్రేస్ కాగా, 3,19,627 మంది ఉన్నారో లేదో కూడా తెలియలేదు. తాజా అధికారిక డేటా ప్రకారం మిస్ అయిన మూడేళ్ల తర్వాత కూడా జాడ తెలియని వారు 50 శాతం నుంచి 55 శాతం వరకు ఉంటున్నట్టు అంచనాలున్నాయి. మరోవైపు ఇండియాలో 45 వేల గుర్తుతెలియని మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో 30 శాతం నుంచి 40 శాతం మంది బేసిక్ లైఫ్ కవర్ తీసుకున్న వారే ఉంటున్నారు. వీరి ఫ్యామిలీలు ఇన్సూరెన్స్ క్లయిమ్ సెటిల్ చేసుకోవడానికి సుదీర్ఘ కాలం వేచిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నిబంధనను ఏడేళ్ల నుంచి మూడేళ్లకు కుదించాలని కోరుతున్నారు. మరోవైపు కొంతమంది ఫ్యామిలీ మెంబర్లు ఫేక్ మిస్సింగ్ కంప్లైంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు చేస్తున్నట్టు కూడా క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్లు గుర్తిస్తున్నారు.

ఫేక్ కంప్లైంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఇన్సూరెన్స్ క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెటిల్ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలతో ఇన్సూరర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతేడాది రూ. 3 వేల కోట్లు లాస్ అవుతున్నారని వెల్లడైంది. ఈ విషయమై బీమా రంగ నిపుణుడు ఒకరు మాట్లాడుతూ ‘‘మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడువును బీమా కంపెనీలు మూడేళ్లకు తగ్గించాలి. మోసం చేసే ఉద్దేశం ఉన్న వాళ్లు మూడేళ్ల దాకా దాక్కొనే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్లకు త్వరగా డబ్బు కావాలి. నిజంగా కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి త్వరగా న్యాయం జరగాలి. కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని అన్నారు.