అశ్వారావుపేట బస్టాండ్ లో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

అశ్వారావుపేట బస్టాండ్ లో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే ఆగ్రహం

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అపరిశుభ్రతపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సత్తుపల్లి ఆర్టీసీ డీఎం విజయలక్ష్మి కి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది ఆర్టీసీ బస్టాండ్ నా.. బూతు బంగ్లానా..  ఇంత అపరిశుభ్రంగా ఉంచుతారా.. మీరు పరివేక్షణ మరిచారా’  అంటూ సీరియస్​ అయ్యారు. 20 రోజుల్లో బస్టాండ్ మధ్య గేటు లో బోర్డును ఏర్పాటు చేయటంతో పాటు సులభ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని, అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను క్లీన్​చేసి మొక్కలు నాటాలని ఆదేశించారు.

అనంతరం టౌన్ లోని దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారస్తులను ఆత్మీయంగా పలకరించారు. రిక్షా కార్మికులతో మాట్లాడి ఓ కార్మికుడికి కొంత నగదు ఇచ్చారు. ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్​లో ఉన్న పాత భవనాలను డిస్మాండిల్ చేసి ఆ ప్రదేశంలో రైతు బజారును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. 

Also Read : మెదక్​ జిల్లాలో ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా