రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ప్రారంభించాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ప్రారంభించాలి  : ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్

గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ కూర్ కోరారు. మంగళవారం హైదరా బాద్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాత జెన్కో ప్లాంట్ స్నానంలో స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పడంలో ప్రభుత్వం సానుకూలం గా ఉందని, దీనిపై గత నెలలోనే బోర్డు ఆమోదం తెలిపిందని డిప్యూటీసీఎం ఎమ్మె ల్యేకు వివరించారు. అలాగే పాలకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడానికి లిఫ్ట్ మంజూరు చేయాలని కోరారు.