అత్యంత మతిమరుపు నగరం ముంబాయి

అత్యంత మతిమరుపు నగరం ముంబాయి

అత్యంత మతిమరుపు నగరం ముంబాయి అని ఉబెర్ పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద క్యాబ్ సంస్థల్లో ఉబెర్ కూడ ఒకటి అనే సంగతి తెలిసిందే. కస్టమర్లు ఉబెర్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. అయితే.. కస్టమర్లు మరిచిపోయిన వస్తువుల విషయంలో ఓ నివేదిక విడుదల చేసింది. లాస్ట్ & ఫౌండ్ వార్షిక ఇండెక్స్ లో అత్యంత మరుపు నగరంగా ముంబాయి నిలిచిందని తెలిపింది. ఫస్ట్ టైటిల్ కైవసం చేసుకోగా... ఢిల్లీ NCR రెండో స్థానంలో నిలవగా.. లక్నో మూడో స్థానంలో నిలిచింది. మరిచిపోయిన వస్తువుల్లో వాటర్ బాటిల్స్, కిరాణా సరుకులే కాకుండా.. మామిడిపళ్లు కూడా ఉండడం విశేషం.ఉబెర్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్ ఇండియా 2022 నివేదిక ప్రకారం.. దుస్తులను ఎక్కువ శాతం మరిచిపోతారని వెల్లడించింది.

ఏకంగా ల్యాప్ టాప్ లను కూడా క్యాబ్ లలో వదిలేసి వెళుతున్నట్లు, మధ్యాహ్న సమయంలోనే ఇది జరుగుతోందని పేర్కొంది. గత సంవత్సరం మరిచిపోయిన వస్తువుల్లో ఫోన్ లు, వాలెట్ లు, బ్యాగ్ లు అగ్రస్థానంలో నిలవగా.. ఫోన్ ఛార్జెస్, వాటర్ బాటిల్స్ యుటిలిటీ ఐటమ్ లున్నాయి. ఆధార్ కార్డులు, క్రికెట్ బ్యాట్ లు, కాలేజీ సర్టిఫికేట్లు, బర్త్ డే కేకులు, మామిడిపళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరిచిపోయిన వస్తువులను తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని రైడర్లకు తెలియచేయడం జరుగుతోందని తెలిపింది. ఈ వస్తువులను తిరిగి పొందే రిక్వెస్ట్ ను వాడుకోవాలని సూచిస్తోంది. 
 

మరిన్ని వార్తల కోసం : -
క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు.. బీజేపీ..


ఆసుపత్రిలో చేరిన నవజ్యోత్‌ సిద్ధూ