BAN vs NZ: ఇదేం కర్మరా బాబు.. బంతిని పట్టుకొని ఔటయ్యాడు

BAN vs NZ: ఇదేం కర్మరా బాబు.. బంతిని పట్టుకొని ఔటయ్యాడు

క్రికెట్ లో కొంతమంది విచిత్రంగా వివాదాస్పదంగా ఔటైతే.. మరికొందరు విచిత్రంగా వికెట్ పారేసుకుంటారు. భారత్ వేదికగా ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో శ్రీలంక సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో ఏంజెలో మాథ్యూస్ ఊహించని రీతిలో టైం అవుట్ కావడం అందరినీ షాక్ కు గురి చేసింది. తాజాగా బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ తన స్వయంకృతాపరాధంతో వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వికెట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. 

ఢాకా వేదికగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు నేడు (డిసెంబర్ 6) ప్రారంభమైంది. ఇదిలా ఉండగా 41 ఓవర్లో ముష్ఫికర్ రహీమ్ ఆశ్చర్య కర రీతిలో ఔటయ్యాడు. జేమిసన్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతి ఇన్ స్వింగ్ తిరిగింది. రహీం ఈ డెలివరీని సమర్ధవంతంగా డిఫెన్స్ చేసాడు. ఈ దశలో బంతి ఒక స్టెప్ పడగా..  రహీం వికెట్ల వైపు వెళ్తుందని భావించి చేత్తో బంతిని టచ్ చేసాడు. దీంతో వెంటనే న్యూజిలాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. 

 క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు బంతిని బ్యాట్ తో లేదా కాలితో ఆపాలి. చేత్తో ఆపితే దానికి అవుట్ గా పరిగణిస్తారు. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పెవిలియన్ కు వెళ్లక తప్పలేదు. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ అబ్ స్ట్రకింగ్ కింద అవుట్ అవడం ఆ దేశ  చరిత్రలో ఇదే తొలిసారి. ఓవరాల్ గా 11 మంది ఈ లిస్టులో ఉన్నారు. 

ఈ మ్యాచ్ లో రహీం 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 35 పరుగులు చేసాడు. ఈ టెస్టులో తో గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ప్రస్తుతం 58 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది.  35 పరుగులు చేసిన రహీం టాప్ స్కోరర్ కాగా.. షాదాత్ హుస్సేన్ 31 పరుగులు చేసాడు. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ 3 వికెట్లు తీసుకోగా.. ఫిలిప్స్, అజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.