మ్యూజిక్‌తో మతిమరుపుకు చెక్‌

మ్యూజిక్‌తో మతిమరుపుకు చెక్‌

మనసు బాగోలేకపోయినా, ఏదైనా ఒత్తిడిలో ఉన్నా చాలామంది వాళ్లకు ఇష్టమైన మ్యూజిక్‌ వింటూ వాటి ఆలోచనలనుంచి కొంతవరకు బయటపడతారు. ఇంకొందరు ఎక్కువ ఎంజాయ్‌ చేయడానికి మ్యూజిక్ వింటారు. అంటే, మ్యూజిక్‌కు సమస్యలను దూరంచేసి, మెదడుకు రిలీఫ్‌ ఇచ్చే పవర్ ఉందన్నమాట. ఆ మ్యూజిక్‌ పవర్‌‌నే ఇప్పుడు ట్రాన్సియెంట్‌ గ్లోబల్‌ ఆమ్నేసియాకి వాడబోతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్ట్‌లు. సింపుల్‌గా చెప్పాలంటే మతిమరుపు ఉన్న పేషెంట్లకు అన్నమాట.
రీసెర్చ్‌ కోసం 60 నుంచి 79 ఏండ్ల వయసున్న 47 మందిని తీసుకుని, వాళ్లపై ఎనిమిది వారాలపాటు రీసెర్చ్‌ జరిపారు. వాళ్లంతా మ్యూజిక్‌పై ఎలాంటి అనుభవం లేనివాళ్లే.  
మ్యూజిక్ టాస్క్‌లు ఇచ్చి
మతిమరుపు ఉన్నవాళ్లకు కొన్ని రకాల వర్డ్‌ ఫైండింగ్‌ (పదాలను గుర్తించడం) గేమ్స్‌ పెట్టారు. సున్నితంగా ఉండే టాస్క్‌లు ఇచ్చారు. వాటికి అనుగుణంగా ఉండే మ్యూజిక్‌ని గేమ్‌తో పాటు ప్లే చేశారు. ఆ మ్యూజిక్‌ వింటూ గేమ్స్‌ ఆడినవాళ్లలో రోజురోజుకు కొంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. నెమ్మదిగా వాటిని సాల్వ్ చేయడం మొదలుపెట్టారు. మ్యూజిక్ లేకుండా టాస్క్‌లు చేస్తున్నవాళ్లలో ఎలాంటి మార్పు చూడలేదు రీసెర్చర్లు. కోలుకుంటున్న వాళ్లకు టాస్క్‌లతో పాటు కొన్ని రకాల సంగీత వాయిద్యాలు ఇచ్చి నేర్పించారు. అది రికవరీ రేట్‌ని ఇంకా పెంచింది. ఎనిమిది వారాల తర్వాత వాళ్లు మనుషుల్ని గుర్తుపట్టారు. పాత జ్ఞాపకాలు తిరిగివచ్చాయి చాలామందికి. మాములుగా ఉన్నవాళ్లలో ఎలాంటి మార్పులు గమనించలేదు. 
“సాధారణంగా 60 ఏండ్ల వయసు రాగానే చాలామందికి మతిమరుపు మొదలవుతుంది. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం నుంచి మనుషుల్ని గుర్తు పట్టలేని స్థాయికి వెళ్లిపోతారు. దాన్ని చాలామంది జబ్బుగా చూస్తారు. వాటికి మందులు వాడుతారు. మతిమరుపు ఉన్నవాళ్లకు చిన్నపిల్లలా కేర్‌‌ తీసుకోవాలి. గదిలో పెట్టి బంధించొద్దు. ఈ స్టడీని కొనసాగించి మిగతావాళ్లకి నయం చేయాలని చూస్తున్నాం” అంటున్నారు సైంటిస్ట్‌లు.