నా తండ్రి తప్పు చేశాడు.. క్షమించండి : ముత్తిరెడ్డి కూతురు

నా తండ్రి తప్పు చేశాడు.. క్షమించండి : ముత్తిరెడ్డి కూతురు

తన తండ్రి, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ఆయన కుమార్తె తుల్జా  భవానీరెడ్డి ఆరోపించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. 

మళ్లీ ఏ గొడవలు రాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానని తుల్జా భవనా స్పష్టం చేశారు. తన పేరున రిజిస్ట్రేషన్‌ చేసిన స్థలంలో భవానీ ఈ ప్రకటన చేశారు.12 వందలగజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని ఆమె తొలగించారు.   ఎమ్మెల్యే కాకముందే తన తండ్రి రూ.వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని భవానీరెడ్డి తెలిపారు. కోటీశ్వరుడైన తన తండ్రి ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. తన తండ్రి చేసిన తప్పుకు చేర్యాల ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని భవానీరెడ్డి తెలిపారు.  

‘‘నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్‌ చేసినందుకు నేను చేర్యాల ప్రజలకు క్షమాపణ కోరుతున్నాను’’ అంటూ క్షమాపణ కోరుతున్నట్లు ఉన్న బోర్డును కూడా ఆ స్థలంలో పెట్టారు.   ఇటీవల జనగామలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఈ విషయంపై భవానీ అందరిముందే బహిరంగంగా నిలదీయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.