సైనిక ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు.. 1500 మంది మృతి

సైనిక ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు.. 1500 మంది మృతి

గత ఏడాది మయన్మార్‌‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన ఆ దేశ సైన్యంపై అక్కడి ప్రజలు చేసిన తిరుగుబాటులో 1,500 మంది ప్రాణాలు బలయ్యాయని ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది. తిరుగుబాటు చేసిన నిరసనకారులను సైన్యం చంపిన ఘటనలు అనేకం జరిగాయని, తమ లెక్కల్లోకి వచ్చినవి 1500 మరణాలే అయినప్పటికీ ఆ సంక్షోభంలో కొన్ని వేల మంది మరణించి ఉంటారని పేర్కొంది. ఈ తిరుగుబాటు సందర్భంగా 11,787 మంది చట్ట విరుద్ధంగా బంధించారని యూఎన్ హ్యూమన్ రైట్స్ అధికార ప్రతినిధి రవీనా సందసాని తెలిపారు. అలాగే 8,792 మంది ఇంకా మయన్మార్ ఆర్మీ కస్టడీలోనే ఉన్నారని చెప్పారు. జెనీవాలోని ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.

మయన్మార్‌‌లో ఆర్మీ ప్రభుత్వంపై తమ వ్యతికతను తెలియజేందుకు అక్కడి ప్రజలు శాంతియుతంగా నిరసనలు చేస్తే ఇలా చంపేయడం, నిర్బంధించడం లాంటివి చేశారని రవీనా తెలిపారు. ఆన్‌లైన్‌లో తమ ఆర్మీ ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లను కూడా బంధించినట్లు చెప్పారు. కేవలం నిరసనల్లోనే 1500 మందిని ఆర్మీ కాల్చి చంపినట్లు గుర్తించామని, ఇదికాక ఆర్మీ కస్టడీలోకి తీసుకుని దాదాపు 200 మందిని టార్చర్ చేసి చంపినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. వీళ్లే కాక కొన్ని వేల మందని మయన్మార్ ఆర్మీ చంపినట్లు తెలిసిందని, దీనికి సంబంధించి తమ దగ్గర పక్కా రికార్డులు లేవని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

షుగర్​ లేని స్వీట్లు అందిస్తున్న హెల్దీ హోమ్

తెల్లారేసరికి అదనపు చార్జీలు కట్టాలని మెసేజ్లు

బాలయ్య జోష్‌.. ఈసారి ట్రిపుల్‌‌ ట్రీట్‌‌