
న్యూఢిల్లీ: క్యాన్సర్ జెనిరిక్ డ్రగ్ పొమాలిడోమైడ్ విషయంలో అమెరికాలో తమతోపాటు సెల్జిన్ కార్పొరేషన్, బ్రిస్టల్మియర్స్ స్క్విబ్, బ్రెకెన్రిడ్జ్ ఫార్మాస్యూటికల్ ఇంక్, మరికొన్ని ఇతర కంపెనీలపై కేసు వేసినట్లు నాట్కో ఫార్మా లిమిటెడ్ వెల్లడించింది.లూసియానా హెల్త్సర్వీస్ అండ్ ఇండెమ్నిటీ కంపెనీ సహా మరి కొన్ని సంస్థలు ఈ కేసు వేశాయని పేర్కొంది.
ఈ కేసులో బలంలేదని తాము నమ్ముతున్నట్లు నాట్కో ఫార్మా తెలిపింది. అమెరికాలోని బ్రెకెన్రిడ్జ్ ఈ జెనిరిక్ ప్రొడక్ట్ ఏఎన్డీఏ హోల్డర్గాను, తమ డిస్ట్రిబ్యూటర్గాను ఉన్నట్లు పేర్కొంది. యూఎస్ కేసు నేపథ్యంలో నాట్కో ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో 3.13 శాతం తగ్గి రూ. 885 వద్ద ట్రేడవుతున్నాయి.