ఖుషీ OTT రైట్స్..30 కోట్ల రూపాయలా!

ఖుషీ OTT రైట్స్..30 కోట్ల రూపాయలా!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), స్టార్ బ్యూటీ సమంత(Samantha) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). క్లాస్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు యావరేజ్ హిట్ గా నిలిచింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా..ఖుషి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

లేటెస్ట్గా ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్‌ 1 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌(Netflix) లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్..ఖుషి డిజిటల్ హక్కులను రూ.30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి ఈ ఓటీటీ మొత్తంతో అయిన..ఖుషి నిర్మాతలు నష్టాల నుంచి బయటపడ్డారో..లేదో మరి. దానికి కారణం లేకపోలేదు. 

ఖుషి లో సాంగ్స్ చాలా పెద్ద సక్సెస్ అవడంతో..ఖుషి సినిమా చూసేందుకు ఆడియన్స్ పరుగులు తీశారు. దీంతో ఈ సినిమాకు మొదటి వీకెండ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఆ తరువాత చాలా వరకు డ్రాప్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా రూ.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. నిర్మాతలకు రూ.12 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.

దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్ లో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.  మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని,  వై. రవిశంకర్‌లు ఖుషిని నిర్మించారు.