బీహార్ లోని చాప్రా లిక్కర్ ఘటనలో పరిహారం పై బీహార్ సీఎం నితీష్ కుమార్ వెనక్కి తగ్గడం లేదు. పరిహారం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారంటూ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. మద్యం తాగితే చావు తప్పదన్నారు. తాగి చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వరని స్పష్టం చేశారు. తాగడానికి అనుకూలంగా మాట్లాడేవారు ప్రజలకు ఎలాంటి మంచి చేయరని తెలిపారు.
సరన్ జిల్లాలోని చాప్రాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. 2016 నుంచి బీహార్‌లో మద్యపానం నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ లిక్కర్ ఏరులై పారుతోందని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. కల్తీ మద్యం కారణంగానే వారంతా చనిపోయారని, డాక్టర్లు మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

