
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ(ఎన్ఎస్పీసీఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 05
పోస్టులు: అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్) 03, అసిస్టెంట్ ఆఫీసర్(సేఫ్టీ) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎన్విరాన్ మెంటల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 5.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్(ఎస్ కేటీ), ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఈఏటీ), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు nspcl.co.inలో సంప్రదించగలరు.