యూఎన్వో ఓటింగ్ కు మరోసారి భారత్ గైర్హాజరు

యూఎన్వో ఓటింగ్ కు మరోసారి భారత్ గైర్హాజరు

ఉక్రెయిన్ పై రష్యా దాడులను నిరసిస్తూ యూఎన్వో మాన‌వ హ‌క్కుల క‌మిటీలో ప్రవేశపెట్టిన ఓటింగ్ కు భారత్ మరోసారి గైర్హాజరైంది. యుద్ధం ప్రారంభ‌మైన స‌మ‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఉక్రెయిన్‌లో జ‌రిగిన మాన‌వ హక్కుల ఉల్లంఘ‌న‌ల‌పై ఉన్న‌త స్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యంలో ఓటింగ్ జ‌ర‌గ్గా… ఎక్కువ మంది స‌భ్యులు ఉన్న‌త స్థాయి విచార‌ణ వైపే ఓటు వేశారు. అత్య‌ధిక మెజారిటీ రావ‌డంతో ఇది ఆమోదం కూడా పొందింది.

ఇందులో మొత్తం 47 మంది స‌భ్యులుండ‌గా.. 32 మంది స‌భ్యులు ఈ బిల్లుకు అనుగుణంగా ఓటు వేశారు. అయితే ఈ ఓటింగ్‌కు భార‌త్ దూరంగా ఉంది. భార‌త్‌తో పాటు గాబ‌న్, క‌జ‌కిస్తాన్‌, న‌మీబియా, సూడాన్‌, ఉజ్బెకిస్తాన్‌, పాక్‌, చైనా, అర్మేనియా, బొలీవియా, క్యామ‌రూన్‌, క్యూబా,వెనీజులా కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం:

భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ