సీబీఐ కోర్టుకు చిదంబరం.. విచారణ ప్రారంభం

సీబీఐ కోర్టుకు చిదంబరం.. విచారణ ప్రారంభం

INX మీడియా కుంభకోణం కేసులో అరెస్టైన కేంద్ర ఆర్థిక, హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనాయకుడు పి.చిదంబరంను కొద్దిసేపటి కింద సీబీఐ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. సీబీఐ అధికారులు బుధవారం రాత్రి చిదంబరం ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఫార్మాలిటీస్, వైద్య పరీక్షలు పూర్తిచేసి ఆయన్ను సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో.. నిబంధనలు, చట్టాన్ని స్వార్థం కోసం వాడుకున్నారని..  INX మీడియాకు నిధుల మళ్లింపు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెల్సుకునేందుకు చిదంబరాన్ని తమకు వారంరోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టును కోరనుంది.

చిదంబరం తరఫున లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ… కుటుంబసభ్యులు కార్తీ చిదంబరం.. నళిని చిదంబరం కూడా సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.