ఐసిస్ చీఫ్ బగ్దాదీ హతంపై పాక్ మాజీ మంత్రి అనుమానం

ఐసిస్ చీఫ్ బగ్దాదీ హతంపై పాక్ మాజీ మంత్రి అనుమానం

ఇస్లామాబాద్: ప్రపంచం మొత్తానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై పాక్ సెనేటర్, మాజీ హోం మంత్రి రెహ్మాన్ మాలిక్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ బగ్దాదీ మరణాన్ని నిర్ధారిస్తూ ఐసిస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఒక వేళ బగ్దాదీ హతమైనది నిజమైతే చాలా సంతోషమేనని రెహ్మాన్ అన్నారు. అతడు చచ్చాడో లేదో స్పష్టమైన నిర్ధారణ కోసం వేచి చూద్దామంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

సిరియాలో యూస్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో బగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న ప్రకటించారు. శనివారం రాత్రి జరిగిన ఆపరేషన్లో బలగాలు అతడిని చుట్టుముట్టారని, ఎటూ తప్పించుకోలేక ఏడుస్తూ పరిగెత్తి, ముగ్గురు కొడుకులతో కలిసి బాంబులతో పేల్చేసుకున్నాడని చెప్పారు. ముక్కలు ముక్కలైన బాడీని పరీక్షించి.. హతమైంది బగ్దాదీనే అని నిర్ధారించామని ట్రంప్ తెలిపారు.