జాదవ్ ను కలవడానికి రెండు గంటలే

జాదవ్ ను కలవడానికి రెండు గంటలే

నేవీ మాజీ ఆఫీసర్ కుల్ భూషణ్ జాదవ్ కు న్యా యసహాయం పై పాకిస్తాన్ దిగొచ్చింది. ఇండియన్ లాయర్లు సోమవారం (సెప్టెంబర్ 2న) జాదవ్ ను కలిసి మాట్లాడొచ్చని, ఇంటర్నేషనల్ కోర్టు తీర్పు, వియన్నా ఒప్పందం మేరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నా మని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహ్మద్ ఫైజల్ ఆదివారం ప్రకటించారు. పాక్ ఆఫీసర్ల సమక్షంలోనే జాదవ్ లాయర్లతో మాట్లాడాల్సి ఉంటుందని పాక్ అధికారులు పేర్కొన్నారు . రూల్స్​లో క్లారిటీ లేక పోవడంతో పాక్ ప్రకటనపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. టెర్రరిజం, గూఢచర్యం కేసుల్లో జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించడం, ఇంటర్నేషనల్ కోర్టు ఆ శిక్షను రద్దుచే యడంతెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇండియాతో సంబంధాలు తెంచుకుంటామన్న పాక్.. ఒక దశలో జాదవ్ కు లీగల్ ఎయిడ్ ను కూడా నిలిపేయాలని భావించి నా చివరికి దిగిరాక తప్పలేదు.