వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి….అధికార గర్వంతో మహిళలను ఓ విలాస వస్తువుగా చూస్తూ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కామన్ అయ్యింది. స్వదేశంలోనే కాదు, విదేశాలకు వెళ్లిన తన బుద్దిని పోనిచ్చుకోరు. ముఖ్యంగా ఆడవాళ్లను చూసి వెకిలి పని చేసే రోడ్రిగో మరోసారి నోరు జారారు.
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో నాలుగు రోజుల పర్యటన కోసం మంగళవారం జపాన్‌కు వెళ్లారు. పర్యటనలో భాగంగా గురువారం జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్ వాసులతో టోక్యోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా.. తాను ముద్దుపెట్టుకొనేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదిక దగ్గరగా కూర్చోవాలని ఆయన కోరారు.
వీరిలో మొదటి మహిళను రోడ్రిగో ముద్దాడుతుండగా ఆమె చాలా అసౌకర్యానికి గురయ్యింది. పెదవులపై ముద్దు పెట్టుకోవద్దని సైగలు చేయడంతో చెంపలపై ముద్దుపెట్టుకొని వదిలేశాడు. మిగతా నలుగురు మహిళలు అభ్యంతరం తెలపడంతో వారికి కూడా చెంపలపై ముద్దు పెట్టారు.
తాను సాధారణంగా ముద్దులు పెదవులపైనే పెట్టుకొంటానని తెలిపారు రోడ్రిగో. అయితే నన్ను నపుంసకుడుని కాకుండా ఈ అందమైన మగువలు సాయం చేశారని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు.
రోడ్రిగో తీరు అక్కడకు వచ్చిన వారికి నచ్చక పోయినా అధ్యక్షుడి గౌరవార్థం చప్పట్లు కొట్టారు.