గూగుల్ లో​ ఫొటో ఎడిటింగ్​ ఫీచర్లు

గూగుల్ లో​ ఫొటో ఎడిటింగ్​ ఫీచర్లు

సెర్చ్​ ఇంజిన్​గా మొదలైన గూగుల్...​ గూగుల్ మ్యాప్స్​, ఫొటోస్​, మీట్​ అని చాలా సర్వీస్​లు అందిస్తోంది. ఇతర యాప్​ కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త  అప్​డేట్స్​ తీసుకొస్తోంది. ఈ సారి యాడ్స్​ని స్కిప్​ చేసే ఫీచర్​, యూట్యూబ్​లో గూగుల్ మీటింగ్స్​ లైవ్​ స్ట్రీమింగ్​, ఫొటో​ ఎడిటింగ్​ ఫీచర్లు తెచ్చింది గూగుల్​.

వాట్సాప్​ నుంచి గేమింగ్ యాప్స్​ వరకు ఏ యాప్​ కావాలన్నా గూగుల్ ప్లే స్టోర్​లో నుంచి డౌన్​లోడ్ చేసుకుంటాం. యాప్స్​ వల్ల యూజర్ల సేఫ్టీ, ప్రైవసీకి ఇబ్బంది రాకుండా  ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ తీసుకొస్తుంటుంది గూగుల్. అలా ఈసారి ఏం తెచ్చిందంటే... యాప్స్​ని వాడేటప్పుడు మధ్యలో యాడ్స్​ వస్తుంటాయి. వాటిలో కొన్నింటికి స్కిప్​ యాడ్ ఆప్షన్​ వస్తుంది. మరికొన్నింటికి స్కిప్​ యాప్​ ఆప్షన్​ రాదు. దాంతో యాడ్ పూర్తయ్యే వరకు ఆగాలి.  ఇకపై యాడ్స్​ డిస్టర్బెన్స్​ ఉండకుండా స్కిప్ చేయడం కుదరని, ఇబ్బందికరంగా ఉండే యాడ్స్​, యాప్స్​ని నిలిపివేయనుంది గూగుల్. అంతేకాదు 15 సెకన్ల వరకు క్లోజ్​ చేయలేని ఫుల్​స్క్రీన్ యాడ్స్​కి పర్మిషన్​ ఇవ్వొద్దని కూడా యాప్​ డెవలపర్స్​కు  చెప్తుందట. సెప్టెంబర్ 30 నుంచి ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రతినిధులు చెప్తున్నారు. 

స్పీడ్ ఎంత ఉండాలో చెప్తుంది

కొత్త ప్లేస్​కి వెళ్తున్నా, దారి తెలియకపోయినా గూగుల్ మ్యాప్ వాడతారు చాలామంది. దగ్గరి దారి చూపించడమే కాదు ఇకనుంచి ‘ఏ స్పీడ్​లో బండి నడపాలి?’ అనేది కూడా చెప్తుంది గూగుల్ మ్యాప్స్​. ఈ ఫీచర్‌‌ని బెంగళూరులో టెస్ట్ చేస్తోంది.  స్పీడ్ లిమిట్​ ద్వారా జంక్షన్లు, క్రాసింగ్​ల దగ్గర ఎక్కువ సేపు ఆగకుండా చూసుకోవచ్చు. అంతేకాదు ఎక్కడ రోడ్లు మూసేశారు, కార్బన్​ మొనాక్సైడ్ వంటివి గాలిలో ఎంత శాతం ఉన్నాయి అనేవి కూడా తెలుసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్​ని  కోల్​కతా, హైదరాబాద్​లో అందుబాటులోకి తెస్తుంది గూగుల్.

గూగుల్ ఫొటోల్ని ఎడిట్ చేయొచ్చు

గూగుల్ ఫొటోస్​లో వీడియో ఎడిటింగ్ ఫీచర్​ రాబోతోంది. ఈ ఫీచర్​ క్రోమ్​బుక్ యూజర్లకు ముందుగా అందుబాటులోకి రానున్నదట. ఈ ఫీచర్​ ఉంటే.. యూజర్లు తమ వీడియోలకి నచ్చిన పాటని బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​గా పెట్టుకోవచ్చు. వాటికి నచ్చిన థీమ్​తో, ఇష్టమైన వాళ్ల ఫొటోల్ని యాడ్ చేసుకోవడమే కాకుండా  టైటిల్​ కార్డ్స్​ కూడా పెట్టుకోవచ్చు. అంతేకాదు ఫొటోలు, క్లిప్స్​ని సెలక్ట్ చేసుకొని ఆర్డర్​లో పెట్టొచ్చు. 

పిక్సెల్ ప్రొ బడ్స్

హెడ్​ఫోన్ల బదులు చాలామంది వైర్​లెస్​ ఇయర్​బడ్స్​ వాడుతున్నారు. ఈమధ్యే గూగుల్ కూడా పిక్సెల్​ ప్రొ బడ్స్​ పేరుతో కొత్త ఇయర్​బడ్స్ తీసుకొచ్చింది. వీటి సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. బ్యాటరీ ఏడు గంటలు వస్తుంది. వీటిలో సిక్స్​–కోర్ ప్రాసెసర్​ ఉంది.  అంతేకాదు గూగుల్ అసిస్టెంట్​ వాయిస్​ యాక్టివేషన్​ కూడా చేసుకోవచ్చు. వీటి ధర రూ.19,900.

యూట్యూబ్​లో  లైవ్ స్ట్రీమింగ్​​ 

​గూగుల్ మీట్​ యూజర్ల కోసం యూట్యూబ్​ స్ట్రీమింగ్ అనే కొత్త  ఫీచర్​ తీసుకొస్తోంది గూగుల్. ఈ ఫీచర్​ ద్వారా  మీటింగ్స్​ని యూట్యూబ్​లో లైవ్​ స్ట్రీమ్​ చేయొచ్చు. గూగుల్ మీట్ సెషన్​​ని నిర్వహించే​ అడ్మిన్లకు దీనిమీద కంట్రోల్ ఉంటుంది. ఎన్జీవోలు తమ సేవా కార్యక్రమాల గురించి, స్థానికులు తమ సమస్యల గురించి అందరికీ చెప్పడానికి ఈ ఫీచర్​ చాలా ఉపయోగపడుతుంది. లైవ్ స్ట్రీమింగ్​ను పాజ్​ చేయొచ్చు, రీ–ప్లే చేయొచ్చు.  అయితే... యూట్యూబ్​లో లైవ్​ స్ట్రీమింగ్ చేయడానికి ముందు వాళ్ల యూట్యూబ్​ ఛానెల్ లైవ్​ స్ట్రీమింగ్​కి అనుమతించాలి. ఇందుకు ఒక రోజు పడుతుంది. అంటే... గూగుల్ మీటింగ్స్ లైవ్​ స్ట్రీమింగ్​ కోసం ఒకరోజు ముందే యూట్యూబ్​ వాళ్ల అప్రూవల్ తీసుకోవాలి.