
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీకి ఎన్నికల సంఘం పార్టీ గుర్తును కేటాయించింది. కెప్టెన్ కొత్తగా ప్రారంభించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)కు హాకీ స్టిక్ బాల్ ను పార్టీ గుర్తుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 14న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పీఎల్ సీ ఈ గుర్తు నుంచే పోటీకి దిగుతోందని కెప్టెన్ తెలిపారు.
‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ హాకీ స్టిక్ విత్ బాల్ గుర్తును పొందిందని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఇక గోల్స్ కొట్టడం మాత్రమే మిగిలి ఉంది’ అని పంజాబ్ లోక్ కాంగ్రెస్ తన ట్వీట్‌లో పేర్కొంది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పీఎల్‌సీ బీజేపీతో ముందస్తు పొత్తు పెట్టుకుంది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాలు రావడంతో కెప్టెన్ గత ఏడాది రాజీనామా చేసి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఫిబ్రవరి 14న పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం మార్చి 10న కౌంటింగ్ చేసి ఫలితాలు వెలువరించనుంది.
‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ (PLC) పేరుతో మాజీ CM @capt_amarinder ప్రారంభించిన కొత్త పార్టీకి ఎన్నికల చిహ్నంగా హాకీ స్టిక్-బాల్ లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేస్తూ.. ఇక గోల్స్ కొట్టడమే మిగిలిందని చమత్కరించారు! ఎన్నికల్లో @BJP4Indiaతో పొత్తుపెట్టుకుని PLC పోటీ చేస్తుంది.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 11, 2022
For More News..
లతా మంగేష్కర్కు కరోనా.. ఐసీయూలో చికిత్స