మారిన మోడీ ట్విట్టర్ డీపీ

మారిన మోడీ ట్విట్టర్ డీపీ

భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోస్ మైలురాయిని దాటడంతో ప్రధాని మోడీ తన ట్విట్టర్ డీపీని మార్చారు. కొత్త డిస్‌ప్లే ఇమేజ్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ సీసా ఉంది. అభినందనలు ఇండియా అనే మెసేజ్ అంతటా ప్లాస్టర్ చేసి ఉంది. ఈ ఫొటోలో ప్రధాని మోడీ నోరు, ముక్కు.. సాంప్రదాయ గమ్‌చాతో కప్పబడి ఉన్నాయి. సైంటిస్టులు, డాక్టర్లు, కరోనా వారియర్లును గుర్తించేలా గ్రాఫిక్ డిజైన్‌ను గమనించొచ్చు. వ్యాక్సినేషన్‌లో బిలియన్ మార్కును చేరుకోవడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇండియా చరిత్ర అని.. 130 కోట్ల మంది భారతీయుల, మన దేశ సైన్స్, ఎంటర్‌ ప్రైజ్, సమిష్టి స్ఫూర్తిని చూస్తున్నామని ప్రధాని అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

టార్గెట్ ఈటల.. అందుకే ఇంత డబ్బు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హరీశ్‌ లేకుండానే మెదక్‌ జిల్లా రివ్యూ

అమ్మవారికి.. అగ్గిపెట్టెలో పట్టే చీర