
లాక్ డౌన్‌తో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు ప్రధాని మోడీ. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని.. లాక్ డౌన్ తో వేల మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం అన్నారు. తక్షణ స్పందన మన లక్ష్యం కావాలని.. దో గజ్ దూరీ (2 గజాల దూరం) మన మూల మంత్రం కావాలన్నారు. కరోనాతో పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలన్న మోడీ.. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం కనిపిస్తుందన్నారు.
అందుకే ఫేస్ మాస్కులు, కవర్లు జీవితంలో భాగం కావాలని.. దేశం ఇప్పటికే 2 లాక్‌డౌన్లు చూసిందని తెలిపారు. ఇక ముందు ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలని.. హాట్‌స్పాట్ – రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని తెలిపారు ప్రధాని మోడీ.