కరోనాపై సరైన టైమ్‌‌లో సరైన నిర్ణయాలు

కరోనాపై సరైన టైమ్‌‌లో సరైన నిర్ణయాలు

అందుకే మిగతా దేశాల్లో కంటే మన దగ్గర కంట్రోల్‌‌లో ఉంది
రోజుకు5 లక్షలకుపైగా టెస్టులు చేస్తున్నం
మూడు హైటెక్ టెస్టింగ్ లాబ్స్ ప్రారంభోత్సవంలో ప్రధానిమోడి

న్యూఢిల్లీ: సరైన టైమ్ లో సరైన నిర్ణ‌యాలు తీసుకోవడంతోనే కరోనాపై పోరాటంలో ఇతర దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నొయిడా, ముంబై, కోల్ కతాలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్ష‌వర్ధ‌న్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు
ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..’కోట్లాది మంది దేశ ప్రజలు కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. నేడు ప్రారంభించిన హైటెక్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల‌తో కరోనాపై యుద్ధానికి మరింత బలం చేకూర్చినట్టయింది. నొయిడా, ముంబై, కోల్‌‌కతా సిటీలు ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలు. మిలియన్ల సంఖ్యలో యువత ఉపాధి కోసం ఈ నగరాలకు చేరుకుంటుంది. ఇప్పుడు ఈ నగరాల్లో రోజుకు 10వేల టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్న కోవిడ్-19 టెస్టింగ్ సెంటర్లు ఏర్పడ్డాయి. ఈ సెంటర్లు కేవలం కరోనా టెస్టింగ్ కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో హెపటైటిస్ బీ – సీ, డెంగ్యూ లాంటి రోగాలకు టెస్టులు చేయవచ్చన్నారు.

టెస్టింగ్ కెపాసిటీని 10 లక్షలకు పెంచుతాం..

కరోనాపై పోరులో కీలకమైన మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రారంభంలోనే రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. క్వారంటైన్ సెంటర్, కోవిడ్ ఆస్పత్రి, టెస్ట్- ట్రేస్ – ట్రీట్ విధానం.. ఇలా వేగంగా వసతులు పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. దేశంలో 11 వేలకుపైగా కొవిడ్ 19 ఫెసిలిటీస్ ఉన్నాయని, 11 లక్షలకుపైగా ఐసోలేషన్ బెడ్లు ఉన్నాయని చెప్పారు. జనవరిలో ఒకే ఒక్క చోట కరోనా టెస్టులు చేసే సదుపాయం ఉండేదని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,300 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయన్నారు. వీటిలో రోజుకు 5 లక్షలకుపైగా టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో రోజుకు 10 లక్షల టెస్టులు చేసేలా సామర్ద్యం పెంచుతున్నామన్నారు.

రోజుకు5 లక్షలకుపైగా పీపీఈ కిట్లు ఉత్పత్తి..

ఆరు నెలల క్రితం దేశంలో పీపీఈ కిట్లు తయారు చేసే ఒక్క సంస్థ లేదని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,200కు పైగా తయారీ సంస్థలున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. ప్రతి రోజు 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నాయన్నారు. ఒక దశలో ఎన్-95 మాస్కులు సైతం ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అయ్యేవని, ప్రస్తుతం దేశంలోనే రోజుకు 3 లక్షలకుపైగా ఎన్-95 మాస్కులు తయారవుతున్నాయని చెప్పారు. అతి  తక్కువ టైమ్ లో పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్‌‌వాడీలు, హెల్త్, సివిల్ వర్కర్ల‌కు అసాధారణ రీతిలో ట్రైనింగ్ ఇచ్చామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ..