సాగుచట్టాల రద్దు తర్వాత తొలిసారి పంజాబ్ పర్యటనలో ప్రధాని

సాగుచట్టాల రద్దు తర్వాత తొలిసారి పంజాబ్ పర్యటనలో ప్రధాని

ప్రధాని మోడీ బుధవారం పంజాబ్ లోని పర్యటించనున్నారు. ఫిరోజ్ పూర్ లో  దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ-అమృత్ సర్- కత్రా ఎక్స్ ప్రెస్ హైవేకు భూమిపూజ చేయనున్నారు.  దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పీజీఐ ఉపగ్రహ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అక్కడ ప్రధాని పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు సాగుచట్టాల రద్దు తర్వాత ప్రధాని మోడీ తొలిసారి పంజాబ్ లో పర్యటిస్తున్నారు. సిక్కు వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

For More News..

కాల్వలో కారును గుర్తించిన పోలీసులు

మే నెల నుంచి కరెంట్​బిల్లులు భారీగా పెంపు

ట్రాఫిక్ చలాన్లతో కోట్ల ఆదాయం