ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ..5 గంటల వరకు 60 శాతం ఓటింగ్

ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ..5 గంటల వరకు 60 శాతం ఓటింగ్

దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ముగిసింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్19) సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఎండల సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రి 5 గంటల వరకు60 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే మొత్తం పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. 

ఎన్నికల సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు తప్పా అంతా ప్రశాంతంగా నే ముగిసింది. మొదటి విడత 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, కొత్తగా పెళ్లి అయిన జంటలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ లకు వచ్చారు.

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. మొదటిదశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల 19) ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ వినియోగించుకున్నారు ఓటర్లు.. ఆరు గంటల వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. ఫస్ట్ ఫేజ్ లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. లోక్ సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

also read : కేజ్రీవాల్ డైట్ పై వివాదం... తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. కరూర్ లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్ లో ఓటేశారు బీజేపీ చీఫ్ అన్నామలై. కోయంబత్తూరు మోడల్ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు . 

శివగంగలో ఓటేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.  తమిళనాడులోని మొత్తం 39 సీట్లను ఇండియా కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. కోయంబత్తూర్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓటు వేశారు.