నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు

నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు

నిర్భయ దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. వారికి ఉరిశిక్ష అమలు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఆఖరి ప్రయత్నంగా దోషుల్లో ఒకరైన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ వేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు.

ఈ పిటిషన్ ను రెండు రోజుల క్రిందట కేంద్ర హోంశాఖ  రాష్ట్రపతికి పంపించింది. దీంతోపాటే, నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి ఎక్కువ సమయం కూడా తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు.దీనితో వారిని ఉరి వేయడానికి లైన్ క్లియర్ అయింది.

అయితే ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఈ నెల 22న సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు  గురైన తర్వాత ఉరి తీయడానికి మధ్య 14 రోజులు గడువు ఉంటుంది. దాని ప్రకారం ఉరిశిక్ష మరో 14 రోజులు ఆలస్యం కానుంది.

Related News: నిర్భయ దోషుల ఉరి.. మార్చిన తేదీ