లక్ష కడ్తమని చెప్పి..48 వేలే కంప్లీట్ !

లక్ష కడ్తమని చెప్పి..48 వేలే కంప్లీట్ !
  • సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై గత సర్కారు తప్పులు 
  • నిర్మాణాల నుంచి లబ్ధిదారుల ఎంపిక దాకా లోపాలు 
  • నిధులు దారి మళ్లించినట్టు తప్పులు ఎత్తి చూపిన కాగ్  
  • పూర్తయిన ఇండ్లను మూడేండ్ల దాకా ఇవ్వలేదు
  • రూ. 3,983 కోట్ల నిధులు వృథా 
  • అసెంబ్లీలో రిపోర్ట్ వివరాలు వెల్లడించిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలపై గత ప్రభుత్వాన్ని కాగ్ కడిగేసింది. గత పాలకులు చేసిన తప్పులను, లోపాలను ఎత్తి చూపింది. గురువారం అసెంబ్లీలో సర్కార్ కాగ్ రిపోర్ట్ ని ప్రవేశపెట్టింది.  ఇందులో సిటీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై సంచలన విషయాలను బయటపెట్టింది.

నిర్మాణాల నుంచి మొదలుపెడితే లబ్ధిదారుల ఎంపిక వరకు గత సర్కార్ వైఫల్యం చెందినట్టు రిపోర్టులో స్పష్టంచేసింది. ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా కూడా మూడేండ్ల వరకు ఖాళీగా ఉంచిందని, దీంతో రూ.3,983.68 కోట్లు వృథా అయినట్లు పేర్కొంది. డబుల్ ఇండ్లకు కేటాయించిన నిధులు దారి మళ్లించిందని కాగ్ గుర్తించింది.  స్కీమ్ అమలు, ఆర్థిక నిర్వహణలోనే లోటుపాట్లు ఉన్నాయని, సిటీలో లక్ష డబుల్ ఇండ్లు  కడుతామని గత ప్రభుత్వం చెప్పిందని,  కేవలం 48, 178 మాత్రమే పూర్తి చేసిందని వివరించింది.

ఇంకా 45, 735 ఇండ్లు  నిర్మాణ  దశలోనే ఉన్నాయని, మరో 6,087 ఇండ్ల నిర్మాణం నిలిపివేసినట్లు తెలిపింది. డబుల్ ఇండ్లకు తెచ్చిన నిధులు ఇతర పథకాలకు, సంస్థలకు దారి మళ్లించారని పేర్కొంది. నిర్మాణాలు మొదలు పెట్టి ఆరేండ్లు దాటినా లక్ష్యం మాత్రం పూర్తికాలేదని తెలిపింది. మొత్తానికి గ్రేటర్ లో డబుల్​ ఇండ్ల నిర్మాణంలో గత సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయినట్టు స్పష్టంచేసింది. 

సౌలతులు కల్పించకపోగా..  

సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. లిఫ్ట్ లు, వాటర్, ఎలక్ర్టిసిటీ ఇతర పనులు పూర్తికాలేదు.  అధికంగా కొల్లూర్ లో 15,660 ఇండ్లను నిర్మించారు. ఏడాదిన్నర  కిందటే నిర్మాణాలు పూర్తయినా ఎన్నికల ముందు లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఎక్కువ రోజులు అలాగే ఉంచడంతో కొన్ని రిపేర్లు కూడా చేయాల్సి ఉంది.

వీటితో పాటు కొన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో పట్టాలు అందుకున్న వారిని ఇండ్లలోకి అనుమతివ్వడంలేదు. ఒక్క కొల్లూరులోనే కాకుండా సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పట్టాలిచ్చారని సంతోషిస్తుండగా..  లబ్ధిదారులను ఇండ్లలోకి వెళ్లనివ్వకపోతుండగా సొంతింట్లోకి ఇంకెప్పుడు వెళ్తామని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.  పట్టాలు ఇచ్చే ముందు అన్ని పనులు పూర్తిచేసి అప్పగించి ఉంటే బాగుండేదని అంటున్నారు. 

కొత్త సర్కార్ పైనే ఆశలు

 ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు కొత్త ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఇండ్లను చేతికి ఇచ్చినట్లే ఇచ్చిందని, కానీ వాటిలోకి మాత్రం వెళ్లలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేటికి కూడా అద్దె ఇండ్లలోనే ఉంటూ కిరాయి చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా పట్టాలు పంపిణీ చేసినా పనులు పూర్తికాకపోగా ఇండ్లలోకి పోలేకపోయారు. అందజేసిన ఇండ్లలో వెయ్యి మంది కూడా వాటిలోకి వెళ్లలేదు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని తమకు కేటాయించిన ఇండ్లలోకి త్వరగా వెళ్లేలా చూడాలని కోరుతున్నారు.  

Also read : దక్షిణ తెలంగాణకు కేసీఆర్​ చేసిన తొమ్మిది ద్రోహాలు