కుటుంబ పార్టీల్లో భయం పట్టుకుంది

కుటుంబ పార్టీల్లో భయం పట్టుకుంది

ఫతేపూర్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా టీకా అంటే కుటుంబ పార్టీలు భయపడ్డాయని ప్రధాని మోడీ అన్నారు. మోడీ, యోగితో విపక్షాలకు సమస్య అని చెప్పారు. ‘కరోనా టీకాలను కుటుంబ పార్టీలు బీజేపీ టీకాలుగా పిలుస్తూ ఎద్దేవా చేశాయి. కానీ ఈ వ్యాక్సిన్లు అంటే ఇద్దరికి భయం. అందులో ఒకటి కరోనా వైరస్ అయితే.. మరొకటి టీకాలను వ్యతిరేకించిన పార్టీలు, నేతలు. వీరికి మోడీ, యోగిలతో సమస్య. మేం తీసుకొచ్చిన వ్యాక్సిన్లతో వీరికి ప్రాబ్లమ్’ అని ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోడీ పేర్కొన్నారు. 

విపక్ష పార్టీలు ట్రిపుల్ తలాక్ నిషేధాన్ని కూడా వ్యతిరేకించాయని చెప్పిన మోడీ.. దేశంలోని మహిళల సంక్షేమం గురించి తాము ఆలోచించొద్దా అని ప్రశ్నించారు. పేదలకు బీజేపీ ప్రభుత్వం అందజేస్తున్న ఆరోగ్య పథకాలు, ఇళ్లు, మరుగుదొడ్లతోపాటు ఇతర స్కీముల వల్ల తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుండటంతో కుటుంబ పార్టీల్లో భయం పట్టుకుందన్నారు. ఏళ్లుగా బుందేల్ఖండ్ రైతులు డిమాండ్ చేస్తున్న కేన్, బేట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

బాక్సాఫీస్ దగ్గర సందడే సందడి

రూ.100 కోట్లతో ఐటీ టవర్స్కు శంకుస్థాపన

మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్