- అదే మా కల.. భారత్‌లో చిప్‌లకు కొరత రాదు: మోదీ
- భారత్‌ను సెమీ కండక్టర్ పవర్‌హౌస్‌గా మారుస్తం
- దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్
- ఢిల్లీలో సెమీకాన్ 2024 సదస్సులో ప్రధాని ప్రసంగం
గ్రేటర్ నోయిడా: ప్రపంచంలోని ప్రతి డివైజ్‌లో భారత్‌లో తయారుచేసిన చిప్ ఉండాలనేదే తమ కల అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ను సెమీ కండక్టర్ పవర్‌హౌస్‌గా మారుస్తామని చెప్పారు. స్మార్ట్ఫోన్లనుంచి ఈవీ, ఏఐ వరకు ప్రతిదానికి పునాది అయిన సెమీకండక్టర్లను దేశీయంగా తయారు చేసేందుకు పెట్టుబడులు పెంచుకోవడం, సప్లై చైన్‌ను నిలుపుకోవడం ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరమని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో బుధవారం జరిగిన ‘సెమీకాన్ ఇండియా 2024’ సదస్సుకు మోదీ హాజరై, మాట్లాడారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సెమీకండక్టర్ల డిమాండ్‌ను భారత్ తీరుస్తుందన్నారు. విదేశీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు అన్నిరకాల సహకారం అందిస్తామని చెప్పారు.
Also Read:-90 రోజుల్లో 59 బైకులు కొట్టేశాడు
భారత్‌కు త్రీ డీ పవర్
దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉన్నదని మోదీ తెలిపారు. సంస్కరణలకు అనుకూల సర్కారు, తయారీ రంగానికి అనువైన వాతావరణం, ఆశావహ మార్కెట్భారత్కున్న త్రీ డీ పవర్అని వివరించారు. ఇలాంటి పవర్ ప్రపంచంలో మరెక్కడా దొరకడం కష్టమేనని తెలిపారు. భారత్‌లో వృద్ధికి అనుకూల వాతావరణం ఉన్నదని వెల్లడించారు. సెమీ కండక్టర్ల తయారీ సౌకర్యాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం 50 శాతం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రయత్నంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. 5జీ అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే భారత్.. ప్రపంచవ్యాప్తంగా 5జీ హ్యాండ్సెట్లకు రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారిందని పేర్కొన్నారు. దేశ ఎలక్ట్రానిక్స్ రంగం ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉన్నదని, ఈ దశాబ్దం చివరినాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ రంగంలో 60 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. ఇది నేరుగా భారత సెమీకండక్టర్ రంగానికి మేలుచేస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్తయారీ 100% దేశంలోనే జరగాలన్నదే తమ లక్ష్యమని, తప్పకుండా తాము సెమీకండక్టర్ల తయారీతోపాటు ఎలక్ట్రానిక్స్
ఉత్పత్తిని ఇండియాలో పూర్తిచేస్తామని చెప్పారు.
మన ఇండస్ట్రీకి రెండువైపులా శక్తి
కొవిడ్ తరహా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితు లు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే సప్లై చైన్ అత్యంత అవసరమని, వివిధ రంగాల్లో దీన్ని సృష్టించేందుకు భారత్ కృషిచేస్తున్నదని మోదీ చెప్పారు. సాధారణంగా చిప్‌లోని డయోడ్స్ శక్తిని ఒక దిశలోనే తీసుకెళ్తుంది, కానీ.. భారత సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రత్యేకమైన డయోడ్స్ఉన్నాయని, వాటికి రెండువైపులా శక్తి ఉంటుం దని అన్నారు. భారత్ సెమీకండక్టర్ సెక్టార్ విప్లవం అంచున ఉన్నదని, ఈ రంగాన్ని డెవలప్ చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న దని పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పెరుగుతున్నదని, భవిష్యత్తులో ఇది మరింత పురోగమిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సెమీ కండక్టర్ల తయారీ విధానం లో దాదాపు 85వేల మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆర్అండ్ డీ ఎక్స్పర్టులు పనిచేసే లా ప్రణాళికలు సిద్ధం చేశామని మోదీ చెప్పారు. విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడితే.. 21వ శతాబ్దంలో చిప్‌ల కొరత రానేరాదని మోదీ చెప్పారు.