పాట్నా ఆస్పత్రిలో పెరోల్ ఖైదీపై కాల్పులు..తీవ్రగాయాలు

పాట్నా ఆస్పత్రిలో పెరోల్ ఖైదీపై కాల్పులు..తీవ్రగాయాలు

బీహార్ రాజధాని పాట్నాలో కాల్పులు కలకలం రేపాయి.పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పెరోల్ ఖైదీపై గురువారం (జూలై 17) ఉదయం కాల్పులు జరిపారు. ఖైదీకి తీవ్రగాయాలయ్యాయి. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  

గురువారం ఉదయం  శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరాస్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి ముందు కాపు కాచిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తి పెరోల్ ఖైదీ చందన్ మిశ్రాపై  ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో రోగులు భయాందోళనకు గురయ్యాయి. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. గాయపడిన ఖైదీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 

►ALSO READ | ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు... 12 ఏళ్ళ బాలుడు అరెస్ట్

బక్సర్ కుచెందిన చందన్ మిశ్రా, కేసరి హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం బ్యూర్ జైలు లో ఉన్నాడు. వైద్య చికిత్స కోసం అతడిని పెరోల్ పై పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చినక్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పులపై సీసీఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. 

బక్సర్ జిల్లా నివాసి అయిన ఖైదీ చందన్ మిశ్రాపై డజన్ల కొద్దీ హత్య కేసులున్నాయి. అతన్ని బక్సర్ నుంచి భాగల్పూర్ జైలుకు తరలించారు. చందన్ పెరోల్ పై వెళ్లి చికిత్స కోసం పరాస్ ఆసుపత్రిలో చేరాడు. ప్రత్యర్థి ముఠా అతడిపై దాడి చేసిందని పాట్నా పోలీసులు తెలిపారు.