ఆగి ఉన్న కంటెయినర్ ను ఢీ కొట్టిన బస్సు..ముగ్గురు మృతి

ఆగి ఉన్న కంటెయినర్ ను ఢీ కొట్టిన బస్సు..ముగ్గురు మృతి

మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సెప్టెంబర్ 1న  అడ్డాకుల మండలం కాటవరం స్టేజ్ వద్ద NH 44 పై  ఆగివున్న కంటైయినర్  ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. 

 బస్సు హైదరాబాద్ నుంచి పొద్దుటూరు వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. మృతులు అష్రస్ ఉన్నిసా, హసన్, ఎల్లమ్మ గా గుర్తించారు.  మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 31 మంది ఉన్నారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు