నిజాయితీ కలిగిన వ్యక్తే సీఎం అవ్వాలి

నిజాయితీ కలిగిన వ్యక్తే సీఎం అవ్వాలి

అమృత్ సర్: పంజాబ్ కు నిజాయితీ కలిగిన సీఎం అవసరం ఉందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ సీఎం అభ్యర్థి అయిన భగవంత్ మాన్ నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. పంజాబ్ కు అలాంటి నిజాయితీ కలిగిన సీఎం అవసరం ఉందన్నారు. నిజాయితీ, పారదర్శకత కలిగిన ప్రభుత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో పంజాబ్ లో నిజాయితీపరులైన క్యాండిడేట్లకు టిక్కెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. 

'మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన భగవంత్ మాన్ దగ్గర డబ్బు లేదు. ఆయన నిజాయితీపరుడు. ఎవరి దగ్గర నుంచి ఇరవై ఐదు పైసలు కూడా ఆయన తీసుకోలేదు. పంజాబ్ లో ఓ వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే.. పెద్ద పెద్ద కార్లు, బంగళాలు వారి సొంతమవుతాయి. కానీ భగవంత్ మాన్ అలా కాదు. ఏడేళ్లుగా ఎంపీగా సేవలందిస్తున్న ఆయన, ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య

ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

ముస్లిం ఓట్లు.. ఎంఐఎంకు మళ్లించడమే బీజేపీ టార్గెట్